ఈమధ్య కాలంలో ఆలీ నోటి వెంట వస్తున్న మాటలు అందర్నీ ఆశ్చర్య
పరుస్తున్నాయి. అలీ ఇటువంటి మాటలు కావాలని అంటున్నాడో లేక సెటైర్లు
అనుకుంటున్నాడో ఎవరికీ అర్ధంకాక పోయినా అలీ మాటలు మాత్రం ఈమధ్య చాల మందికి
అసౌకర్యంగా మారుతున్నాయి అన్న వార్తలు వినపడుతున్నాయి.
ఆమధ్య
‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకలో అలీ తనతో యాంకరింగ్ చేస్తున్న సుమను
టార్గెట్ చేస్తూ బూతు సెటైర్లు వేస్తే ఆ కార్యాక్రమం అయిపోయిన తరువాత సుమ
అలీకి పెద్ద క్లాస్ తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన జరిగి
కొద్దిరోజులు గడవకుండానే అలీ తన మితిమీరిన బూతు సెటైర్లతో మళ్ళీ వార్తలకు
ఎక్కాడు.
నిన్న సాయంత్రం విజయవాడలో
జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో సక్సస్ మీట్ లో అలీ మాట్లాడుతూ మళ్ళీ
కొన్ని బూతు జోక్స్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత నడుమును చూస్తే
తనకు విజయవాడ బెంజ్ సర్కిల్ గుర్తుకు వస్తుందని అలీ సెటైర్లు వేసినట్లు
టాక్.
ఈ సెటైర్ కు ఆకార్యక్రమానికి
వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సక్సస్ మీట్ కు
సమంత రాకపోవడంతో అలీకి ఎటువంటి సమస్య రాలేదు. అయినా ఒక మంచి కమెడియన్ గా
పేరుగాంచిన అలీకి ఈ వయస్సులో ఈ బూతు సెటైర్ల సరదా ఏమిటి అని కొంతమంది
కామెంట్స్ చేసినట్లు టాక్..