పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తెలుగు సినిమా రంగంపై ప్రస్తుతం మకుటం లేని మహరాజులా వెలిగిపోతున్నాడు. ఈ మధ్య వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ సినిమాల ఇంట్రవెల్ నుంచి వచ్చినా సినిమా మొత్తం ఈయనదే అన్నట్టుగా హిట్ అయ్యింది. పవన్ కళ్యాన్ సినిమా పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ప్రజలకు దగ్గరయ్యడు. మానవతా వాదిగా ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునే వాడిగా పవన్ కళ్యాన్ తెలుగు ప్రేక్షకుల మసులో నిలిచిపోయాడు.

గబ్బర్ సింగ్ 2 ఫ్యాన్స్ పోస్టర్

 

ఈయన నెక్ట్స్ పిక్చర్ ‘గబ్బర్ సింగ్ 2’.  నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై పవన్ సన్నిహితుడు శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు కేఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా అలియాస్ వెడ్స్ జానకీ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ ఎంపికైంది. మరి రెండో హీరోయిన్ గా పాత్ర కూడా సినిమాలో చాలా ముఖ్యమైనదే మరి దీనికోసం ఎవరిని ఎంపిక చేయాలన్నది తర్జన భర్జన సాగుతుంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్లు రెజీనా, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో పవన్ సరసన నటించే ఛాన్స్ పై ముగ్గురు హీరోయిన్లలో ఎవరికి దక్కుతుందో చూడాలి. గబ్బర్‌సింగ్‌తో  ఒక్క ఊపు ఊపిన పవన్ ఈ సినిమాలలో ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో...

 
Top