అప్పట్లో హాలీవుడ్ మూవీస్  లో లిప్ లాక్ కిస్ (పెదాలపై ముద్దులు) చూస్తే అబ్బో అనుకునేవారు. చీ ఈ ఇంగ్లీష్ సినిమాలు ఏంట్రా బాబు  పచ్చి పచ్చిగా ముద్దుల పెట్టుకుంటున్నారు అనుకునేవారు.  తర్వాత ఈ జాడ్యం బాలీవుడ్ కి పాకింది అంతే అన్ని సినిమా ఇండస్ట్రీలో అలా అలా పాకేసింది. ఇది ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో వీపరీతం అయ్యింది.

ఆర్యా2 లో కాజల్ పెదాలపై ముద్దు పెడుతున్న అల్లు అర్జున్

 

 సాధారణంగా హీరో హీరోయిన్ రొమాన్స్ సీన్లలో బుగ్గపై ముద్దలుపెట్టుకోవడం నడుం మీద చేయి వేసి వచ్చే సీన్లు ఉండేవి. కానీ ఇప్పుడు రొమాంటిక్ సీన్లంటే పెదవులపై చుంభించడం సర్వ సాధారణం అయిపోయింది. అంతే కాదు ఈ సీన్లు సోషల్ మీడియాలో పాపులర్ చేసి పెద్ద బిజినెస్ కూడా చేయడం మొదలైంది.

 
Top