బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక పదుకొనె చేత
20 కేజీల బరువు మోయిస్తున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భాన్సాలీ ఇప్పుడు
బాలీవుడ్ మీడియాకి హాట్ టాపిక్ గా మారాడు.
వైవిధ్యమైన సినిమాలకు చిరునామాగా ఉండే సంజయ్ లీలా భన్సాలీ సినిమాలలో హీరోయిన్స్
వేసుకునే దుస్తులు చాల విభిన్నంగా ఉంటాయి.
సాంప్రదాయాలను ప్రతిభింబించేలా వెరైటీ సినిమాలను
తీసే ఈయన గతంలో రూపొందించిన ‘రామ్ లీలా’ సినిమాలలో నటించిన దీపికా పదుకొనె 30
కిలోల బరువుతో ఉండే గాగ్రాచోళీని వేసి దీపికను
టార్చర్ పెట్టాడు. అయితే ఈ సినిమాలో నటించినందుకు దీపికకు మంచి పేరుతో పాటు భారీ పారితోషికం
కూడా ముట్టింది.
ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ
దర్శకుడు రూపొందిస్తున్న ‘భాజీ రావ్ మస్తానీ’ అనే చ చారిత్రాత్మక సినిమాలో దీపిక
నటిస్తున్న సందర్భంలో దీపికకోసం 20 కేజీల కవచం తయారు చేయించి ఆ కవచాన్ని వేసుకుని ఈ
సినిమా యుద్ధ సన్నీ వేశాలలో నటించాలి అని చెపుతున్నాడట.
అయితే అంత భారీ కవచాన్ని తాను మోయలేను అని దీపిక
గగ్గోలు పెడుతున్నా దర్శకుడు సంజయ్ లీలా
భన్సాలీ పట్టించుకోవడం లేదు అని టాక్. ఈ సినిమాలో నటించినందులకు దీపికకు 5 కోట్ల
పారితోషికం ఇచ్చారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అంత భారీ పారితోషికానికి ఆ మాత్రం
బరువు ఉన్న కవచం మోయాలని దర్శకుడి అభిప్రాయం కాబోలు..