మిల్క్ బ్యూటీ తమన్న రీసెంట్ గా బిజినెస్ వ్యవహారంలో చురుగ్గా పాల్గొంటుంది. తను సంపాందించిన దాంట్లో మొదటి సారిగా ఓ బిజినెస్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. అదే గోల్డ్ బిజినెస్. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో గ్లామరస్ అవతారాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తమన్న క్రేజ్ ని సంపాందించుకుంది. అయితే బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్నకు వరుస ఆఫర్స్ రాకపోయినప్పటికి, అక్కడ ఇండస్ట్రీ పెద్దలతో మాత్రం గుడ్ రిలేషన్స్ ని మెయింటెన్ చేస్తుంది. ఇదిలా ఉంటే, తమన్నా ‘వైట్ గోల్డ్’ అనే జ్యువెలరీ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ఈ జ్యువెలరీ బ్రాండ్ ఎంతో ప్రత్యేకమైనది. ఎంతోమంది టాప్ డిజైనర్స్ వీటిని తయారు చేస్తున్నారు.
అలాగే ఇందులో తమన్నా ఫేవరైట్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ హబ్ గా ఉండే ముంబాయ్ లో, తన బిజినెస్ కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలనుకుంటుంది తమన్న. అయితే తను సొంతంగా స్టార్ట్ చేసిన వైట్ గోల్డ్ జ్యూవెలరీ బిజినెస్ లో, తనతో పాటు ఓ బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బడా ఫైనాన్షియర్ ఉన్నాడనే టాక్స్ వినిపిస్తున్నాయి.
బిటౌన్ లోని భారీ చిత్రాలను ఎగ్జిటివ్ ప్రొడ్యూజర్ గా చేస్తున్న తను, తమన్న స్టార్ట్ చేసిన జ్యువెలరీ బిజినెస్ లో కీలక పాత్ర పోషించాడనే టాక్స్ వినిపిస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’ అలాగే రవితేజ సరసన బెంగాల్ టైగర్ సినిమా చేస్తోంది.
 
Top