మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్
డూపర్ కాంబినేషన్. వీరి కాంబినేష్ లో జులాయి ఏ రేంజ్ లో హిట్టయ్యిందో
అందరికీ తెలుసు. త్రివిక్రమ్ రొమాంటిక్ సీన్లు తీయడంలో రాఘవేంద్రరావు
శిష్యుడు లాంటి వాడు. అల్లు అర్జున్ హీరోగా , త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఇప్పటికే
ప్రేక్షకుల ముందు ఉండాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఈనెల 9 న
ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్
సరసన సమంత , అదా శర్మ , నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. అయితే ఓ
సన్నివేశంలో అల్లు అర్జున్ , అదా శర్మల మధ్య ఓ లిప్ లాక్ సన్నివేశం
రూపొందించాడట త్రివిక్రమ్. చాల రొమాంటిక్ గా ఉండే ఈ సన్నివేశాన్ని సెన్సార్
కి వెళ్ళేటప్పుడు త్రివిక్రమ్ తొలగించేశాడట.
Home
»
allu arjun
»
s/o satyamurthy
»
s/o satyamurthy lip lock
»
samantha
»
telugu film news
»
సత్యమూర్తి సినిమాలో షాక్..!!