మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ప్రారంభమైనప్పటి నుండి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్నీ సంచలనాలే చోటు చేసుకుంటున్నాయి దీనికి కారణం ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జులాయి సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో అందరికీ తెలుసు.
సినిమాకి సంబంధించిన ఆడియో ఈనెల 15న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ కూడా నిశ్చయించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. సమంత, ఆదాశర్మ, నీత్యామీనన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, స్నేహ ఇతర పాత్రల్లో నటించారు. అల్లుఅర్జున్ త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి ఎంత హిట్టయ్యిందో తెలిసిందే.
ఈ చిత్రంపై కూడా అంచనాలు అదే స్థాయిలో సాగుతున్నాయి టాలీవుడ్‌లో! ఈ సినిమా మొత్తంగా  కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ లెక్కన సన్నాఫ్‌ సత్యమూర్తి మూవీని.. రేసుగుర్రం మొత్తం కలెక్షన్ల రేటుకు అమ్మేశారు నిర్మాతలు. దీంతో ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాలంటే కనీసం  కోట్లు వసూళ్లు చేయాలని సినీ జనం భావిస్తున్నారు.
ఈ రేంజ్‌ వసూళ్లు సాధిస్తే బయ్యర్లకు లాభాలు రావడంతో.. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు సొంతం చేసుకోనుంది. మరి.. సన్నాఫ్‌ సత్యమూర్తి కలెక్షన్లు బన్నీ కెరీర్‌లో సరికొత్త రికార్డ్‌‌ను క్రియేట్‌ చేస్తాయేమో చూడాలి
 
Top