కోలీవుడ్ ఫిల్మ్ తెరకెక్కబోతున్న ఓ మూవీ, ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉండడం వెరీ కామన్. ముగ్గురు హీరోలు అంటే అది పెద్ద విషయమే. ఎందుకంటే ఇద్దరి హీరోలను హ్యాండిల్ చేయటమే దర్శకుడిని పెద్ద వ్యవహారం.
అయితే ఇక్కడ ఏకంగా నలుగురు హీరోలు ఒకే మూవీలో నటించనున్నారు. అది కూడా నాలుగు భాషలలో రూపొందే సినిమాలో! అవును, ఈ నాలుగు భాషలలో రూపొందే సినిమాల్లో వేర్వేరు హీరోలు నటిస్తున్నారు. హీరోలు నలుగురు కాదా అని, హీరోయిన్స్ కూడ నలుగురు హీరోయిన్స్ ఉంటారు అనుకుంటే పొరపాటే. హీరోయిన్ మాత్రం నలుగురికి ఒక్కరే ఉంటున్నారు.
తనే త్రిష. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ యిన స్పెషల్ 26 (స్పెషల్ చబ్బిస్) సినిమాను దక్షిణాదిలో రీమేక్ చేయడానికి ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో రవితేజ, తమిళంలో ప్రశాంత్, మలయాళంలో దిలీప్, కన్నడలో దర్శన్ హీరోలుగా నటిస్తారని అంటున్నారు. ఈ నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారట.
త్రిషకి ఈ ఆఫర్ రావడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేస్తుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు తెర వెనకకు వెళ్లిపోయిన ప్రముఖ నటి త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందట. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌ను పెళ్లాడబోతోందనే విషయం తెలిసిందే.
 
Top