గతకొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ పై హన్సిక సెటైర్లు వేసింది అంటూ వెబ్ మీడియాలో నానా హడావిడి జరిగింది. పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని హన్సిక టాలీవుడ్ ఎంపరర్ పవన్ ను ఎలా టార్గెట్ చేసింది అంటూ మీడియా వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. అయితే ఈ విషయం పై హన్సిక తన ట్విటర్ లో అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
తాను ఒక కోలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం చాల తప్పుడు సమాచారంగా మారి మీడియాలో వార్తలుగా వచ్చాయని అయితే ఆ వార్తలకు తనకు ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది ఈ యాపిల్ బుగ్గల చిన్నారి.
వాస్తవానికి తనను ఆ ఇంటర్వ్యూలో రాజకీయాల పట్ల ఆ శక్తి ఉందా అని ప్రశ్నించినప్పుడు అనుకోని ఈ ప్రశ్నకు షాక్ అయ్యానని చెప్పింది. అంతేకాదు సమాజసేవ చేయడానికి రాజకీయాలే అవసరం లేదు అని చెప్పాను కాని తాను పవన్ కళ్యాణ్ ప్రస్తావన కాని మరి ఏ ఇతర కోలీవుడ్ హీరో ప్రస్తావన కాని తాను తీసుకు రాలేదని అటువంటి సాహసం కూడా తాను చేయలేనని క్లారిటీ ఇచ్చింది.
అంతేకాదు తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని అంటూ అవకాశం వస్తే తాను కూడా పవన్ తో నటించి మెప్పించాలని ఎదురు చూస్తూ ఉంటే తాను చేయని కామెంట్ల పై తన పై బురద జల్లడం తనకు ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేసింది హన్సిక. ఎంతోమంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంటూ సమాజ సేవ చేస్తున్న హన్సికను కూడ ఈ గాసిప్పుల హడావిడి వెంటాడటంతో ఈ క్లారిటీ ఇచ్చింది అనుకోవాలి..
 
Top