సామాన్యంగా అమ్మాయిలను తమ అందం గురించి తమ ఎదుట పొగిడితే ఎంతో ఆనందపడిపోతూ
ఉంటారు. అయితే ఈ పద్దతికి పూర్తి వ్యతిరేకం సమంత. ఈ క్యూట్ బ్యూటీని ఎవరైనా
తన ఎదుట చాల అందంగా ఉన్నావు అని కామెంట్ చేస్తే సమంతకు విపరీతమైన కోపం అట.
ఈ విషయం స్వయంగా ఈ మాయలేడి ఈమధ్య ఒక కోలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో
చెప్పింది.
తనను ఎవరైనా చాల అందంగా ఉన్నావు అంటూ పొగిడితే తనకు చాల ఇబ్బందిగా ఉంటుందని
దీనికి కారణం తాను అందగత్తెను కాను అన్న విషయం తనకు ఖచ్చితంగా తెలుసు అని
షాకింగ్ కామెంట్లు చేసింది సమంత.
అంతేకాదు తనకన్నా అందంగా ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారని అంటూ
తన సినీ జీవితంలో వచ్చిన విజయాల విషయంలో తన అందం కంటే అదృష్టమే ఎక్కువ పని
చేసిందని తన వ్యక్తిగత అభిప్రాయమని సమంత చెపుతూ ఉంటే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న
యాంకర్ షాక్ అయింది.
అంతేకాదు సమంత చదువుకునే రోజులలో తన క్లాసులో ఉన్న అమ్మాయిలతో పోల్చుకుంటూ
తాను అంత అందంగా లేను ఏమిటని భాధ పడేదట. మరి సమంత ఇప్పుడు అనుభవిస్తున్న
టాప్ హీరోయిన్ స్టేటస్ ను చూసి సమంత చిన్ననాటి స్నేహితులు ఇప్పుడు సమంతను
చూసి ఎలా ఫీల్ అవుతారో చూడాలి...