రజినీకాంత్ ను సూపర్ స్టార్ గా మార్చిన బాషా సినిమా ఒక ట్రెండ్ సెటర్ ‘ఈ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే’ అని రజినీ అన్న డైలాగ్ దక్షిణాది సినిమా రంగంలో పంచ్ డైలాగ్స్ హవాకు శ్రీకారం చుట్టింది. తన నటనతోనే కాకుండా తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాకు ప్రాణం పోసాడు రజినీ.  మాస్ సినిమాల చిత్రీకరణలో ఒక నూతన ఒరవడి సృస్టించిన ఈ సినిమా కధను అనుసరిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమా కూడా బాషా రేంజ్ ని చెరుకొలెకపొయింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెర పై ప్రసారం అయినప్పుడు ఛానల్స్ కు రేటింగ్స్ బాగానే వస్తున్నాయి.  అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలు మొదలు అయ్యాయి అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ఈ సినిమాకు గతంలో దర్శకత్వం వహించిన సురేశ్‌కృష్ణ ప్రస్తుతం ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడని టాక్.. ఇటీవలే రజినీకాంత్ తో ఈ విషయమై సురేష్ కృష్ణ చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రజినీ మాత్రం ఈ సీక్వెల్ విషయంలో పెద్దగా ఆశక్తి చూపడం లేదని అంటున్నారు. దీనికి కారణం ఈ సినిమాకు సీక్వెల్ తాయారు చేయడంలో ఏమైనా పోరాపాట్లు జరిగితే దాని ప్రభావం విపరీతంగా తన ఇమేజ్ మీద పడుతుందని రజినీ అభిప్రాయం అట. అదీకాక ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తీసినప్పుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కష్టమని రజినీ సూచిస్తున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా సురేష్ కృష్ణ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాడు అనే వార్తలు తమిళ మీడియాలోనే కాకుండా తెలుగు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి.
 
Top