పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాల గోపాల’ షూటింగ్ క్లైమేక్స్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అవడంతో ఇక ఈ సినిమాకు సంబంధించి పవన్ వర్క్ మరో పదిరోజులు మించి లేదు అనే వార్తలు విశ్వసనీయంగా వినిపిస్తున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా తనను బాధిస్తున్న వెన్ను నొప్పి సమస్యకు ఇక పరిష్కారం లేదు కేవలం సర్జరీ ఒకటే మార్గం అని వైద్యులు తేల్చి చెప్పడంతో పవన్ ఒక విచిత్రమైన డైలమాలో పడిపోయాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం సర్జరీ జరిగితే కనీసం నెలరోజులు బెడ్ రెస్ట్ అవసరంని డాక్టర్లు తేల్చి వేయడంతో సర్జరీ ముందుగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గబ్బర్ సింగ్-2’ పూర్తి చేసి సమ్మర్ పోటీకి రెడీ పెట్టాలా లేదంటే డాక్టర్ల సలహా మేరకు సర్జరీ చేయించుకుని ఆ తరువాత నెమ్మదిగా తన ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ను పట్టాలు ఎక్కించాల అనే విషయం పై పవన్ తేల్చుకోలేక పోతున్నాడు అంటూ జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. అదీకాకుండా ‘గోపాలుడి’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే మరో సినిమాను పూర్తి చేయకుండా ఆపరేషన్ కోసం బెడ్ ఎక్కితే వచ్చే సంవత్సరం కూడా తన నుండి సరైన కమర్షియల్ సినిమా రాకుంటే అది తన కెరియర్ కు అంత మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో ఒక వైపు గోపాలుడిలో నటిస్తూనే తన సన్నిహితుల అభిప్రాయాలను తన ఆపరేషన్ విషయమై పవన్ సలహాలు తీసుకుంటున్నట్లు మీడియా టాక్.
 
Top