పక్కా కమర్షియల్ ఫార్మెట్ లో మూవీలను తెరకెక్కించే దర్శకుడు వినాయక్. వినాయక్ ఓ మూవీని డైరెక్ట్ చేస్తే ఆ మూవీ కచ్ఛితంగా మినిమం గ్యారెంటీ మూవీగా తెరకెక్కుతుంది. గతంలో తను వరుసగా తెరకెక్కించిన ఫ్యాక్షన్ మూవీ లాంటి కథలను గత కొంత కాలం నుండి వినాయక్ తెరకెక్కించడంలేదు. మూవీలో కొద్దిగా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఉండే విధంగా చూసుకుంటూ, నేటి తరం ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేసేవిధంగా తను ఆలోచనలు చేస్తున్నాడు. అయితే అక్కినేని అఖిల్ నటించే తొలి చిత్రానికి వి.వి వినాయక్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కథ గురించి వినాయక్, కోన వెంకట్ లు కసరత్తు చేస్తున్నారు. అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి మంచి కథతో రావాలని నాగార్జున వినాయక్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వినాయక్ బెల్లంకొండ సురేష్ తనయుడు, శ్రీనివాస్ ని సిల్వర్ స్క్రీన్ ని పరిచయం చేశాడు. ఆ విధంగా చేసిన అల్లుడు శీను మూవీ బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ ని సాధించింది. ఇప్పుడు అఖిల్ కోసం ఇలాంటి కథనే వినాయక్ రెడీ చేశాడంట. అందుకు నాగార్జున, వినాయక్ కి చాలా స్ట్రిక్ట్ గా కొన్ని బోర్డర్ లైన్స్ ని పెట్డాడంట. 'అల్లుడు శీను' లాంటి రొటీన్ కమర్షియల్ కథ అఖిల్ కోసం వద్దని నాగార్జున వినాయక్ కు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, వినాయక్, కోన వెంకట్ టీంతో కలిసి కమర్షియల్ ఫార్మాట్ లోనే వెళుతూ మంచి కథను డెవలప్ చేసే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. నాగచైతన్య తొలి చిత్రం 'జోష్' కథకు సంబంధించి తాను మరింత జాగ్రత్త పడి వుంటే బాగుండేదని నాగార్జున ఇప్పటికీ బాధపడుతున్నారని అంటున్నారు. మొత్తానికి నాగార్జున, తనయుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రికి సంబంధించిన కథలలో చాలా క్లారిటిగా ఉన్నాడని తెలుస్తుంది. నాగార్జున ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకు వినాయక్ ఎటువంటి కథతో నాగార్జున వద్దకు వస్తాడో చూడాలి మరి.
 
Top