పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఫైనల్ గా చివరి దశకు చేరుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి దేవుడుగా, విక్టరీ వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనున్న సినిమా ఈ ‘గోపాల గోపాల’. ఇటీవలే ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ నగర శివార్లలో తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో వెంకటేష్, శ్రియ, మిదున్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ తో గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ‘దేవుడినే సవాల్ చేసే ఓ భక్తుని కథ ఇదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని’ ఈ చిత్ర వర్గాలు అంటున్నాయి. మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ ని చాలా స్టైలిష్ గానూ, ఎంటర్టైన్మెంట్ గా దర్శకుడు కిషోర్ పార్ధసాని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పెర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని దర్శకుడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే పలు జిల్లాలకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయినట్టుగా టాలీవుడ్ లో వార్తలు తెలుస్తున్నాయి. త్వరలోనే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘గోపాల గోపాల’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ అలాగే నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
Top