చాలామంది హీరోయిన్స్ పెళ్ళి అయిన మగవాళ్ళతో చనువుగా ఉండి ఆ తరువాత ప్రేమలో పడి వారికి రెండో భార్యగా ఉండటానికి కూడా సిద్దం అవుతారని అయితే అటువంటి పద్దతికి స్నేహాలకు తాను దూరం అంటూ కామెంట్స్ చేసింది ప్రియాంకా చోప్రా. తాను ఉండే ప్లేస్ అయినా చేసే స్నేహం అయినా సౌకర్యవంతంగా ఉండటంతో పాటు గౌరవ ప్రదంగా ఉండాలని అంటూ తనకు సరిపడని వ్యక్తులతో ముఖ్యంగా పెళ్లి అయిన మగ వాళ్ళతో చనువుగా ఉండి వారి భార్యలకు అభద్రతా భావం కలిగించడం తనకు ఇష్టం లేదని అంటూ పెళ్ళి అయిన మగవాళ్ళ పై షాకింగ్ కామెంట్లు చేసింది ఈ హాట్ బ్యూటీ. అంతేకాదు ఎవరైనా అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయితో తాను క్లోజ్ గా ఉండననీ పరాయి సొత్తు ఆశించే వ్యక్తిత్వం తనది కాదు అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతూ ఈ మధ్య ఒక సినిమా పత్రికకు ప్రియాంక ఇచ్చిన ఇంటర్వ్యూ హాట్ న్యూస్ గా మారింది.  అయితే ప్రియాంక పెళ్లి అయిన మగవాళ్ళ పై చేసిన కామెంట్లు ఎవరినైనా హీరోయిన్ ను దృష్టిలో  పెట్టుకుని  చేసిందా అంటూ బాలీవుడ్ మీడియా రంద్రాన్వేషణ మొదలు పెట్టింది.
 
Top