బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ మధ్య ఎటువంటి పరిచయం ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మొదట్లో పరిచయంగా ఉండే వారి బంధం, తరువాత లవర్స్, ఎఫైర్స్, చిరవకు కపుల్స్ వరకూ వెళుతుంది. ఈ తరహా జంటలకి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొదవే లేదు. ఎవరికి వారే, వారికి నచ్ఛిన వారితో ఎంజాయ్ చేయడం, ఎఫైర్స్ పెట్టుకోవడం అనేది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజాగా ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆషికి మూవీతో ఫేమస్ అయిన జోడి శ్రద్దా కపూర్, ఆదిత్యా రాయ్ కపూర్. ఆ మూవీ బిటౌన్ బాక్సాపీస్ ని షేక్ చేయటమే కాకుండా, యూత్ లో ఎప్పటికి గుర్తుకుపోయేలా చేసింది. అయితే ఆ మూవీ తరువాత నుండి శ్రద్ధా కపూర్, ఆధిత్యా రాయ్ కపూర్ ల మధ్య ఎఫైర్ నడుస్తుందనేది బాలీవుడ్ ఓపెన్ టాక్. ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడూ ఖండిస్తూనే వస్తున్నారు. ఇద్దరం ఒకరికొరం స్నేహితులం తప్పితే, ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమలు, ఇతర వ్యవహారాలు లేవు అంటూ పలు సందర్బాల్లో స్టేట్ మెంట్స్ ఇచ్చకుంటూ వస్తున్నారు. దీంతో మీడియా సైతం ఓ కంట కనిపెడుతూనే వస్తుంది. తాజాగా శ్రద్ధాకపూర్ కి ఓ వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్‌లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఆధిత్య కపూర్ ఈ విధంగా చేయటంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు బయట పడింది. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా రాయ్ కపూర్, ఓ జ్యువెలరీ షాప్‌ కి వెళ్ళి అక్కడ కోటి రూపాయల విలువైన రింగ్ ని తీసుకొని శ్రద్ధాకపూర్ కి ఇచ్చినట్టు బిటౌన్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరూ పెళ్ళిచేసుకోబోయే జంట బాలీవుడ్ చెప్పుకుంటుంది.
 
Top