సమంత తన వ్యాఖ్యలతో వెబ్ మీదియాలోనే కాదు బయట కూడ ఎదో ఒక సంచలనం చేస్తూ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. సమంత సిద్ధార్థ్ ల పెళ్లికి సంబంధించిన అధికారక వార్త ఈ సంవత్సరాంతంలో వెలువడు తుంది అని మీడియా ఊహగానాలు చేస్తూ ఉంటే సమంత హడావిడిగా ఒక కోలీవుడ్ కమెడియన్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని మీడియా ఎదుట అనడం ఇప్పుడు కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘కత్తి’ ట్రైలర్ ఇటీవలే రీలీజై మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఈమధ్యనే ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్ సతీష్, సమంత గురించి మాట్లాడుతూ 'తనకి సమంతలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వుంద'ని అన్నాడు. ఈ పొగడ్తకు ఉబ్బిపోయిన క్యూట్ బ్యూటీ సమంత ఆ ఆడియో వేడుకలో అందరూ చూస్తుండగానే 'సతీష్‌ని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ' అంటూ హంగామా చేసింది.  ఈ జోక్ కు అందరూ నవ్వుకున్నా కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా పడ్డ ఈ వార్తను చూసి సిద్ధార్ద్ ఏమి అనుకుని ఉంటాడు అన్నదే ప్రశ్న.
 
Top