What Is Good
  • అందమయిన ప్రదేశాలు
  • సంగీతం
What Is Bad
  • కథ
  • పట్టులేని కథనం
  • ఎడిటింగ్
  • నటీనటుల పనితీరు
  • దర్శకత్వం
Bottom Line:రోమియో : పూరి రాసినట్టు ఏమాత్రం అనిపించని ప్రేమకథ ...

Romeo - చిత్ర కథ

సమంత(అడోనిక) కి కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం అలానే ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇటలీ లో ని రోమ్ కి చేరుకుంటుంది. కిట్టు(సాయి రామ్ శంకర్) అనుకోకుండా సమంతని చూసి ఆమె వెనుక పడటం మొదలు పెడతాడు. ఆమె పాస్ పోర్ట్ తన దగ్గరే దాచిపెట్టుకొని సమంతని ఏడిపిస్తూ ఉంటాడు. విసిగిపోయిన సమంత ఒకరోజు కిట్టు ని నిలదీయగా తన గతం చెప్తాడు కిట్టు గతంలో పద్దు అనే అమ్మాయిని ప్రేమించినట్టు, పద్దు మరియు సమంత ఇద్దరు ఒకేలాగా ఉన్నారు అని చెప్తాడు అంతేకాకుండా తనని పెళ్లి చేసుకోమని సమంతని అడుగుతాడు కిట్టు. సమంత అప్పటికే రాకేశ్(సుబ్బరాజ్) ని ప్రేమిస్తున్నట్టు చెప్తుంది. ఆ తరువాత ఏమయ్యింది అన్నదే మిగిలిన కథ...

Romeo - నటీనటుల ప్రతిభ

ఈ చిత్ర కథానుసారం మూడు పాత్రలు ఉన్నా చిత్రం మొత్తం మనకి కనబడేది మాత్రం ఇద్దరే, సాయి రామ్ శంకర్ కొన్ని సన్నివేశాల వరకు బాగానే చేసిన చిత్రంలో పాత్రకి కావలసినంత ఎమోషన్ పండించలేదు. అడోనిక చిత్రం ఆసాంతం ఈ పాత్ర మీదనే నడుస్తుంది అందుకు తగ్గట్టుగానే ఈ నటి కూడా చిత్రం మొత్తాన్ని భుజం మీద వేసుకొని అతిగా నటించేసింది. మొదటి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు అవసరానికి మించి నటించింది. ఆమె అందాల ఆరబోత కూడా కాస్త శ్రుతి మించింది అనే చెప్పుకోవచ్చు.. ఈ రెండు పాత్రలు కాకుండా ఈ చిత్రంలో చాలా ప్రత్యేక పాత్రలే ఉన్నాయి .. రవి తేజ కనిపించిన నాలుగు సన్నివేశాలు చిత్రంలో మంచి కిక్ ని తీసుకొచ్చాయి.. సుబ్బరాజ్ తన సన్నివేశాలలో నటించి పరవలేధనిపించారు.. జయసుధ నటించింది ఒకే ఒక్క సన్నివేశం అయిన ఎమోషన్ బాగా అందించారు.. అలీ కనిపించిన కొన్ని సన్నివేశాలలో నవ్వించారు.. నాగబాబు , ప్రగతి అలా తలుక్కుమన్నారు..

Romeo - సాంకేతికవర్గం పనితీరు

కథ అందించిన పూరి ఎక్కువగా కష్టపడినట్టు కనిపించదు ఎందుకంటే చిత్రంలో కూడా కథ అనే పదార్థం ఎక్కడా కనపడదు కాబట్టి.. ఇద్దరు- ఇటలీ - ప్రేమ అన్నట్టు సాగుతుంది కథ వీటిని అతికించాలి అన్నట్టు కథనం ఉంటుంది. అందులో కొత్తదనం లేకపోగా అతుకుల బొంతలాగా ఉంటుంది పాత్రల నడవడిక కూడా ఎక్కడా సరితూగదు. నిజానికి కథనం మీద మరింత వర్క్ అవుట్ చేసుంటే ఈ చిత్రం కాస్త బాగుండేది అనిపించింది.. పాత్రలన్నీ బలంగానే ఉన్న కూడా వాటిని తెర మీద చూపించడంలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు ముఖ్యంగా హీరోయిన్ ఓవర్ గా నటిస్తున్నా సరిగ్గా ట్యూన్ చెయ్యలేకపోయారు దర్శకుడు గోపి గణేష్.. పూరి జగన్నాథ్ రచించిన డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి కాని సన్నివేశానికి సరిపడ్డ సంభాషణలు తక్కువనే చెప్పుకోవాలి.. సినిమాటోగ్రఫీ అందించిన పిజి విందా పరవలేధనిపించారు, ఇటలీ అందాలను కొన్ని సన్నివేశాలలో బానే చూపెట్టినా కొన్ని సన్నివేశాలలో కెమెరా యాంగిల్స్ చాలా తేడా గా ఉన్నాయి.. ఎడిటింగ్ అందించిన నవీన్ నూలి ఆకట్టుకోలేకపోయారు చిత్రంలో చాలా జర్క్స్ కనిపిస్తాయి చిత్రం సరళంగా సాగుతున్న ఫీలింగ్ దాదాపుగా ఏ సన్నివేశంలో కూడా కనబడదు.. సంగీతం అందించిన సునీల్ కశ్యప్ పాటలు ఆకట్టుకున్నాయి అలానే అతని నేపధ్య సంగీతం కూడా బాగుంది కాని సన్నివేశంలో బలం లేకపోవడంతో బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.. టచ్ స్టోన్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి...

Romeo - చిత్ర విశ్లేషణ

పూరి రాసిన ప్రేమ కథ అనగానే అంచనాలను పెంచుకొని మరి చూసే ప్రేక్షకుడు దారుణమయిన నిరాశకి గురి కావడం కచ్చితం ఎందుకంటే ఈ చిత్రంలో ఎం లేదు.. ఎం లేదు అని ఊరికే అనట్లేదు నిజంగానే ఎం లేదు మొదటి సన్నివేశం అవ్వగానే ఇంటర్వెల్ వేసుకొని వెంటనే క్లైమాక్స్ వేసేసుకొని ఉన్నా కథ అర్ధం అయిపోయేది. దీనికి పోయి మొదటి సన్నివేశానికి ఇంటర్వెల్ కి మధ్య సాయి రామ్ శంకర్ కి సైకో కలరింగ్ ఎందుకు ఇచ్చారో మరి.. చిత్రం మొదటి అర్ధ భాగం మొత్తం ఇటలీ లో ని రోమ్ ప్రాంతాన్ని చూపించడానికే సరిపోయింది ఇది సరిపోదని రెండవ అర్ధ భాగంలో వేరోన్ ని చూపించడంలో నిమగ్నం అయ్యారు. ఇందులో తప్ప్పు లేదు కాని ఇది కథలో కలిసేలా ఉంటె చాలా బాగుండేది కాని కృత్రిమంగా కలపడానికి ప్రయత్నించారు.
ఈ కథకి ఇటలీ కి ఎటువంటి సంభంధం లేకపోవడం చాలా బాధపెట్టే విషయం .. ఈ చిత్రం చూసిన ఎవరికయినా కచ్చితంగా అనిపించే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి హీరోయిన్ అవసరానికి మించి నటించేస్తుంది.. రెండోది ఈ చిత్రం ఇటలీ టూరిజం కి ప్రచార చిత్రంగా అనిపిస్తుంది .. ఈ చిత్రం రెడ్ ప్రో కెమెరాలో చిత్రీకరించారు కాని చిత్రీకరణ జరిగి చాలా సమయం కావడంతో క్వాలిటీ తగ్గిపోవడం క్లియర్ గా కనిపిస్తుంది. రవితేజ కనిపించిన నాలుగు సన్నివేశాలు మాత్రమే చిత్రంలో కాస్త మంచి సన్నివేశాలు బాగా నెమ్మదిగా వెళ్తున్న చిత్రానికి అలీ కామెడీ కొంతవరకు సహాయపడింది ఇలా ఈ చిత్రానికి సంబందించిన ముఖ్య తారాగణం కన్నా ప్రత్యేక పాత్రలే ఎక్కువ తోడ్పడ్డాయి... ఈ చిత్రానికి వెళ్ళాలా వద్ద అన్న ఆలోచన ఉన్నట్టయితే ఇదిగోండి సమాధానం ఒకవేళ మీరు ఇటలీ ప్రేమికులు అయితే ఒకసారి ప్రయత్నించండి..

Romeo - కాస్ట్ అండ్ క్రూ

Romeo 2014 Telugu Movie Review, Rating | Live Updates, Story, Talk


5 out of 5
based on
98,51,602
  • Title : రోమియో : రివ్యూ
  • Star Cast : Sai Ram Shankar, Adonika
  • Producer : Dorai Swamy
  • Director : Gopi Ganesh
  • Music : Sunil Kashyap
 
Top