అత్తారింటికి దారేది బ్లాక్ బ్లస్టర్ తర్వాత పవన్ సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తనే ఒక కొత్త పార్టీ ‘జనసేన’ పెట్టి ఒక ప్రభంజనం సృష్టించారు. తర్వాత ఆయన తన పార్టీ తరుపున బిజేపీ, తెలుగు దేశం పార్టీలకు మద్దతు ఇచ్చి ఒక విధంగా వాటి విజయానికి సహకరించారు. ఆ గ్యాప్ తర్వాత సినిమాల్లో తిరిగి నటించేందుకు సిద్దమయ్యారు. ఈ సారీ తను సోలో గా కాకుండా ఒక మల్టీ స్టార్ మూవీ చేయాలనే తలంపుతో బాలీవుడ్ లో వచ్చిన  ‘ఓ మైగాడ్ ’ రిమేక్ చిత్రం ‘గోపాలా గోపాల ’ చిత్రంలో వెంకటేష్ తో నటిస్తున్నారు. వర్ స్టార్ పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం బైక్ పై ఉంటుంది. ఇటివలే ఈ సన్నివేశాలను హైటెక్ సిటీ పక్కనే ఉన్న మాదాపూర్ ఫ్లై ఓవర్ మీద చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం కోసం చాలా ఖరీదైన బైక్ వాడినట్లు సమాచారం. 6.6 లక్షల రూపాయలు ఖరీదు చేసే హ్యోసంగ్ జివి 650 ఆక్విలా ప్రో బ్లూ కలర్ బైక్ పై ఉంటుంది. ఈ బైక్ ను మరింత స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇంట్రడక్షన్ సన్నివేశంతో పాటు తర్వాత కొన్ని సన్నివేశాలలో పవన్ బైక్ పై సందడి చేయనున్నారు. ఈ సినిమాకు కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
Top