రజనీకాంత్ రిస్కీ ఫైట్స్ చేస్తున్నారు. ఫైట్స్ లేని రజనీ కాంత్ సినిమాలంటే అభిమానులు ఏమాత్రం ఊహించుకోలేరు. అందుకే, ఈ వయసులో కూడా ఆయన భీకరమైన యాక్షన్ దృశ్యాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలో లింగా సినిమాలో కనీవినీ ఎరుగని రీతిలో యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేస్తున్నారు. చాలా రిస్క్‌తో కూడిన ఈ ఫైట్స్ చేయడానికి రజనీ ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్‌లీ విట్టేకార్ తెలిపాడు. "ఇంతకు ముందెన్నడూ ఇంతటి డేర్ డెవిల్ యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేయలేదు. ఇది చాలా సాహసోపేతమైన ఫైటింగ్ సీక్వెన్స్" అంటూ లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన రిహార్సల్స్ చేస్తున్నారు. త్వరలో వీటిని రజనీపై చిత్రీకరిస్తారు.
 
Top