రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకు కౌంట్ డౌన్ మొదలైంది. పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమాను ఈనెల 26వ తారీఖున సెన్సార్ కు పంపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సెన్సార్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా ప్రీమియర్ షోను అమెరికాలో ఈనెల 30వ తారీఖున ఏర్పాటు చేయడానికి అప్పుడే ఏర్పాట్లు కూడ మొదలయ్యాయి అనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రీమియర్ షోకు ప్రత్యేకంగా రామ్ చరణ్ హాజరై అమెరికాలోని తెలుగు వారిలో తన క్రేజ్ మరింత పెంచుకోవడం కోసం వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమా కధ విషయమై ఇప్పటికే రకరకాల రూమర్లు హడావిడి చేస్తున్న నేపధ్యంలో విశ్వసనీయ సమాచారం ప్రకారం అందుతున్న న్యూస్ బట్టి ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కధ పై కొంత వరకు అక్కినేని ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిరంజీవి ‘విజేత’ సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి అనే టాక్ ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తోంది.  అంతేకాదు ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని పదేపదే చిరంజీవి బండ్ల గణేష్ ను హెచ్చరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘ఆగడు’ సక్సస్ అయి ఉంటే దసరా రేసుకు సంబంధించి విజేత ఎవ్వరు అనే ఆత్రుత ఉండేది. ఇక ప్రస్తుత పరిస్థుతులలో ఎటువంటి పోటీ చరణ్ గోవిందుడుకు లేకపోవడంతో ఒకే సంవత్సరంలో రెండు హిట్స్ అందించిన హీరోగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అనే మాటలు గట్టిగా ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.
 
Top