భారీ అంచనాలతో విడుదలైన ‘ఆగడు’ పరాజయం చెందడంతో చాలామంది ఈ సినిమాను డైరెక్ట్ గా లేక ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ విసురుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి సమంత కూడా చేరినట్లుగా ఆమె ట్విట్స్ బట్టి అర్ధం అవుతోంది. సమంత నిన్న సందర్భం లేకుండా ఒక విచిత్రమైన ట్విట్ చేసింది. తన ట్విట్ లో ‘బూమరాంగ్’ ల గురించి వివరిస్తూ అవి ఎంత బలంగా విసిరితే అంతే వేగంగా వచ్చి మనకు బలంగా తగులుతాయని అందువల్ల ఈ ‘బూమరాంగ్’ ల విషయంలో ఎంతటి గొప్ప వ్యక్తులైన జాగ్రత్తగా ఉండాలి అంటూ తన ట్విట్ లో కామెంట్స్ చేసింది. అయితే సమంత చేసిన కామెంట్ ‘ఆగడు’ సినిమాకు సంబంధించింది అంటూ అర్ధాలు తీస్తున్నారు విశ్లేషకులు. ‘ఆగడు’ సినిమాలో శ్రీనువైట్ల మహేష్ తో వేయిoచిన సెటైర్లు అన్నీ వికటించి తిరిగి శ్రీనువైట్లకే తగిలాయని అర్ధం వచ్చేడట్లుగా సమంత తన ట్విట్ లో ‘బూమరాంగ్’ ల గురించి ప్రస్తావించింది అని విశ్లేషకుల వాదన. ఈ వార్తలు ఇలా ఉండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నైతిక విలువలు, గౌరవం, ఇంగిత జ్ఞానం, నడవడిక డబ్బుతో కొనలేమని అది మనిషి సంస్కారం బట్టి వస్తాయి అంటూ ప్రకాష్ రాజ్ నిన్న చేసిన ట్విట్ శ్రీనువైట్లను టార్గెట్ చేస్తోంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆగడు పరాజయంకన్నా ఆ సినిమాలో శ్రీనువైట్ల వేసిన సెటైర్లు తిరిగి అతడి మెడకే చుట్టుకుంటూ శ్రీనువైట్లను అన్ని విధాలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అనుకోవాలి జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే.
 
Top