ఒకనాటి ప్రముఖ హీరోయిన్ ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరి ఎమ్ఎల్ఎ రోజా
సినిమా రంగం పై విచిత్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు
ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా ఈ ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలలో డబ్బు
తీసుకుని నటిస్తున్నంత సేపు ప్రజలకు తాము ఏమి చేయకపోయినా బయటకు వస్తే చాలు
బ్రహ్మరధం పడతారనీ అంటూ ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని రాజకీయాలలోకి వచ్చి
ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం పూర్తి కాకుండానే తాము ఏమి చేద్దామన్నా
విమర్శిస్తూ ఉంటారని అంటూ ప్రజల పద్ధతి పై వ్యాఖ్యలు చేసింది రోజా.
ఇదే సందర్భంలో సినిమా రంగంలోని రూమర్స్ గురించి మాట్లాడుతూ అమ్మాయిగా
సినిమా రంగంలో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని అయితే సొంత బందువులు కూడా
ఇటువంటి విషయాల పై ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడినప్పుడు తనకు ఎంతో బాధ
కలిగిందని చెప్పుకొచ్చింది రోజా.
తల్లి ఉన్నప్పుడు తనకు ఆమె విలువ తెలియలేదని తన తల్లి ఏమి చెప్పినా
సీరియస్ గా తీసుకోకుండా ఆమెను చాల బాధ పెట్టాననీ అంటూ ఆమె గుర్తుకు
వచ్చినప్పుడల్లా ఆమె విలువ ఏమిటో తనకు ఇప్పుడు తెలుస్తోందని వ్యాఖ్యలు
చేసింది రోజా. తన సినిమా ‘చామంతి’ కి 5000 వేలు పారితోషికంగా వస్తే చాల
ఆనంద పడ్డానని అంటూ తాను ఎయిర్ హోస్టెస్ కావాలి అనుకుంటే నటిగా స్థిర
పడ్డాననీ చెపుతూ ఇలా ఎన్నో ఆశక్తికర విషయాలను రోజా ఈ ఇంటర్వ్యూలో షేర్
చేసుకుంది.