అనంతపురం జిల్లా హిందూపురం నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బాలకృష్ణ గెలుపు ఖచ్చితమని తేలడంతో ఎంత మెజార్టీతో గెలుస్తాడనే విషయమై ఆ ప్రాంతంలో విపరీతంగా బెట్టింగులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి కావడం అందులోనూ మోడీ – తెలుగుదేశం గాలి విపరీతంగా వీయడంతో పోలింగ్ సరళినిబట్టి ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటూ మెజార్టీ విషయమై బాలయ్య పై భారీ బెట్టింగులు కాస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మొత్తం విలువ కోట్లలోనే వుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఇక కోట్లకొద్ది రూపాయలు చేతులు మారడం ఒక్కటే మిగిలివుందట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం విజయం ఖాయం అంటు నగదుతోపాటు పొలాలు, ఇతర స్థిరాస్తులను సైతం పందేలు కట్టేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.   ఈ బెట్టింగులు పదివేల నుండి యాబై లక్షల వరకు నడుస్తున్నాయని అంటున్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాలలో వైసిపి, టిడిపి పార్టీల విజయ అవకాశాల పై జరుగుతున్న బెట్టింగుల విలువ కొన్ని వందల కొట్లలో జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. పారితోషికం విషయంలో టాలీవుడ్ లో బాలకృష్ణ నెంబర్ వన్ కాకపోయినా అనంతపురం జిల్లాలో మాత్రం బాలకృష్ణ బెట్టింగుల విలువ మాత్రం నెంబర్ వన్ గానే ఉందని టాక్. రాజకీయాలకు ఇంత విలువ పెరిగి పోవడంతో మన సినిమా తారలు అంతా సినిమాలకన్నా రాజకీయాలకే విలువ ఇస్తున్నారు అనుకోవాలి.  
 
Top