సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మరోసారి నిరుత్సాహ పరిచాడు.
రజపీకాంత్ నటించిన గ్రాఫికల్ మాయాజాలం మూవీ విక్రమసింహ విడుదలపై మరో సంచలన
వార్త వెలువడింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాచిత్రం
"విక్రమసింహ" విడుదల వాయిదా పడినట్టు తాజా సమాచారం. పలు వాయిదా తేదీలతో
ఎట్టకేలకు మే 9న విడుదల అంటూ భారీ ప్రచారం జరిగింది. అలాగే థియేటర్స్ లో
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైనంది.
చివరికి ఈ 3డి గ్రాఫికల్ మోషన్ పిక్చర్ మరోసారి విడుదల పడినట్టు ఈరోస్
సంస్థ ప్రకటించింది. సాంకేతిక సమస్యతో అన్ని భాషల్లో ప్రింట్లు చేరడం
ఆలస్యం అవుతున్న కారణంగా రెండు వారాల తర్వాత 23న రిలీజ్ చేస్తున్నట్టు ఆ
సంస్థ తెలిపింది. అయితే తమిళ వెర్షన్ కొచ్చాడియాన్ యధావిధిగా 9న
విడుదలౌతున్నట్టు చెన్నై సమాచారం. మిగతా బాషల్లోకి సంబంధించిన మూవీ విడుదల
డిలే కారణంలో మల్టి ప్లెక్స్ లో బల్క్ బుకింగ్ చేసుకున్న సాప్ట్ వేర్
కంపెనీలు, సినీ ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. అయిన రజనీకాంత్ మూవీ కోసం
ఇంకొన్ని రోజులు వెయిట్ చేయటానికి ఎటువంటి అభ్యతరం లేదంటున్నారు.
మొత్తంగా రజనీకాంత్ చేసిన కొచ్చడియాన్ మూవీపై ఒక్క ఇండియన్ ఫిల్మ్
ఇండస్ట్రీనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు సైతం తెగ
ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తన అప్ కమింగ్ ఫిల్మ్
కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో బిజిగా ఉన్నాడు. ఈ మూవీపైన కూడ భారీగానే
ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.