ఒక డైరెక్టర్ తనను రాత్రిళ్ళు నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ బహిరంగంగా చెప్పి ఛార్మీ సంచలనం కలిగించింది. ఆమె టార్చర్ కు కారణాలు వేరు. ఛార్మి ప్రస్తుతం 'మంత్ర-2' సినిమా షూటింగ్‌లో బిజీగా వుంది. అసలే హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో డైరెక్టర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. ప్రతీ దృశ్యాన్నీ వాస్తవికంగా తీస్తూ ఉండటంతో ఎక్కువగా నైట్ షాట్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నాడట. అయితే అలా రోజూ రాత్రిపూట షూటింగ్ జరుపుతుండటంతో తనకి నిద్రలేకుండా పోతోందని ఛార్మి గగ్గోలు పెడుతోంది. తనకి నిద్రలేకుండా రాత్రుళ్ళు ఇబ్బంది పెడుతున్న డైరెక్టర్‌కి, ''అలా చేయొద్దని మీరైనా చెప్పొచ్చు కదా'' అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కి ఫిర్యాదు చేసింది ఛార్మి. ప్రస్తుతం సినిమాలు ఏమి లేకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితం తనకు పేరుతో పాటు కాసులు కురిపించిన ‘మంత్ర’ సినిమా సీక్వెల్ ను నమ్ముకుని ఛార్మి ఏదోవిధంగా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. హారర్ సినిమాలకు కనీసం ఏ సెంటర్లలో అయినా క్రేజ్ ఉండటంతో కనీసం అక్కడైనా తన సత్తా చాటాలని ఛార్మి ప్రయత్నం. అందుకే తను పడుతున్న కష్టాన్ని తన అభిమానులకు వివరించి ఈ సినిమా పై క్రేజ్ పెంచడానికి ఇదో రకమైన వెరైటీ పబ్లిసిటి చేసుకుంటోంది ఛార్మి. ఈ సినిమా కూడ సక్సస్ కాకపోతే ఇక టాలీవుడ్ లో ఛార్మి కెరియర్ అయిపోయిందనే అనుకోవాలి.
 
Top