జాతిపితగా స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి భారత జాతికి విదేశీయుల పాలన నుండి విముక్తి కలిపించిన మహాత్మాగాంధీ పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ రేపిస్టా? ఈ వార్త వినడానికే చాల అసభ్యకరంగా ఉంది. కానీ ఇది నిజం అంటున్నాయి చారిత్రిక ఆధారాలూ ఇందుకు ఉదాహరణగా 1935 జూన్‌లో గాంధీ తన కుమారుడు హరిలాల్ ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తూ రాసిన మూడు లేఖలు బయటకు రావడం సంచలనంగా మారింది. వచ్చేవారం ఈ లేఖలను లండన్‌లో వేలం వేయనున్నారు. వీటిని వేలం వేయడం ద్వారా లక్ష పౌండ్ల ఆదాయం రావచ్చునని ‘ మల్లోక్’ వేలం నిర్వాహకులు ఆశిస్తున్నారు. ‘ నీ సమస్య నాకు మన దేశ స్వాతంత్ర్యం కన్నా పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ఇది నువ్వు తెలుసుకో ’ అని గాంధీజీ .. హరిలాల్‌కు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. హరిలాల్ కుమార్తె మనూ ద్వారా గాంధీజీకి ఈ విషయాలు తెలిశాయి. ఆమె కొన్నాళ్లు తన తాతగారితో కలిసి శబర్మతి ఆశ్రమంలో నివసించింది. ‘ నీ గురించి మనూ నాకు దిగ్జాంతికరమైన విషయాలు తెలిపింది. అవి నేను నమ్మలేక పోతున్నాను ఎనిమిదేళ్ల వయస్సులో మనూ పై అత్యాచారం చేశావని, ఆ ఘోరం కారణంగా తాను వైద్యచికిత్స కూడా తీసుకోవలసి వచ్చిందని ఆమె వివరించింది’ అని గాంధీజీ ఈ లేఖలో తన పెద్దకొడుకును దుయ్యబట్టాడు అని తెలుస్తోంది ! ‘ నువ్వు ఇంకా మద్యం తాగుతూ, అక్రమ సంబంధాలకు పెట్టుకుంటూ బతికే కన్నా చావడమే మంచిది’ అని కూడా ఆయన తన కొడుకును తిడుతూ రాసిన ఈ ఉత్తరాలు సంచలనంగా మారాయి. గాంధీజీ గుజరాతీ భాషలో రాసిన ఈ లేఖలు మంచి స్థితిలో ఉన్నాయని, గాంధీ కుటుంబంలోని కొన్ని వర్గాలనుంచి ఇవి అందాయని మల్లోక్ వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ లేఖలు గాంధీ సంతకంతో కూడి ఉన్నాయి. మహాత్ముడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ఉత్తరాలను అదే గుజరాత్ నుండి ప్రధాని పదవి ఎక్కబోతున్న నరేంద్ర మోడీ అయినా ఈ ఉత్తరాల వేలాన్ని ఆపు చేసి గాంధీ పరువుతో పాటు మన భారతదేశ ప్రతిష్టను కాపాడుతాడని ఆశిద్దాం.
 
Top