టాలీవుడ్ పై కోపంతో తెలుగు సినిమాలకు దూరంగా జరిగిన హీరో సిద్ధార్ద్ ప్రస్తుతం మీడియా పేరు చెపితే ఒంటికాలు పై లేస్తున్నాడు. దీనికి కారణం తనకు టీనేజ్ కొడుకున్నాడు అంటూ మీడియాలో వస్తున్న వార్తలను చూసి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మంచి నటుడుగా పేరున్న సిద్ధార్ద్ నోటి దురుసు వల్ల ఎప్పుడు అతడికి సమస్యలు వస్తూనే ఉంటాయి. 35 సంవత్సరాలు వయస్సు ఉన్న సిద్ధూకు టీనేజ్ కొడుకును సృష్టించి హడావిడి చేసింది కోలీవుడ్ మీడియా. ఆ మధ్య నటి సోహా అలీఖాన్, శృతిహాసన్‌తో ప్రేమాయణం తరువాత ప్రస్తుతం సమంత ప్రియ నేస్తంగా కొనసాగుతున్న సిద్ధార్ద్ ఈ గాలి వార్తల పై ఘాటుగా స్పందించాడు. తన గురించి, తన కుటుంబం గురించి వదంతులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇలాంటి నిరాధార ప్రచారం తననెంతగానో ఆవేదనకు గురి చేస్తోందని గగ్గోలు పెడుతున్నాడు. తనకంటూ ఒక గౌరవం ఉందని తననింకా చిన్న వాడిగా భావించరాదని అన్నాడు. అయితే కోలీవుడ్ మీడియాలో గుప్పు మన్న ఈ గాసిప్ ఎందుకు బయటకు వచ్చిందో ఎవరికీ అర్ధం కావడంలేదు.  సిద్దార్ద మొదటి భార్యకు పిల్లలు ఉన్న విషయం వాస్తవం అయినా ఏకంగా టీనేజ్ కొడుకు సిద్దూకు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చాడు అన్న విషయమే సమాధానంలేని ప్రశ్న. మరి ఈ పజిల్ కు కోలీవుడ్ మీడియా రానున్న రోజులలో ఎటువంటి సమాధానాలు ఇస్తుందో చూడాలి. 
 
Top