ఈ నెలలో రిలీజ్ అవుతున్న అక్కినేని ఫ్యామిలి మూవీ మనం పై టాలీవుడ్ లో భారీ
ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు కారణం ఏమిటంటే ఈ మూవీలో అక్కినేని మూడు
తరాల నటులు ఒకే వేధికపై కనిపించటమే. అక్కినేని నాగేశ్వరరావుతో పాటు
నాగార్జున, నాగచైతన్యలు స్క్రీన్ స్పేస్ ను పంచుకున్నారు. ఇప్పటికే మనం
మూవీ ప్రమోషన్ స్పీడ్ ను పెంచి, సినీ ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీలింగ్ ను
తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో నాగచైతన్య సరసన స్టార్ హీరోయిన్ సమంత
నటించింది.
వీరిద్దరి కాంబినేషన్స్ లో ఇప్పటి వరకూ వచ్చిన మూవీల్లో ఇదే చాలా ఘాటుగా
ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే మనం మూవీలో నాగచైతన్య, సమంతల మధ్య ఓ
రొమాంటిక్ సాంగ్ ఉండబోతుంది. అలాగే ఓ సీన్ కూడ రసవత్తరంగా ఉంటుందట.
వీరిద్దరి మధ్య జరిగే ఫస్ట్ నైట్ సీన్ లోని సన్నివేశాలు, అలాగే దానికి
సంబంధించి సాంగ్ అభిమానులను హీటెక్కించడమే కాకుండా, థియోటర్స్ లో కేకలు
పెట్టించడం ఖాయం అంటున్నారు.
మనం పోస్ట్ ప్రొడక్షన్ రిపోర్ట్ నుండి అందిన సమాచారం ప్రకారం సమంత,
నాగచైతన్య మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ లో నాగచైతన్యను సమంత డామినేట్
చేసిందని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సమంత నటన ముందు నాగచైతన్యకు చెమటలు పట్టాయని
అంటున్నారు. మొత్తానికి ఏదేమైనా, వీరిద్దరి సీన్స్ మనం మూవీకు సరికొత్త
ఉత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
నాగార్జునకు జోడిగా శ్రేయ నటించింది. వీరిద్దరి మధ్య కూడ రొమాంటిక్ సీన్స్
ఉన్నట్టు టాలీవుడ్ టాక్. మొత్తంగా మనం మూవీ ప్యామిలి రొమాంటిక్ మూవీ
కావడంతో సెన్సార్ వాళ్ళు కూడ ఈ మూవీకు యు/ఎ సిర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది.