తమిళ దర్శకులు తమ విలక్షణమైన ప్రతిభతో కోలీవుడ్ లో రకరకాల ప్రయోగాలు చేస్తూ అక్కడి ఆడియన్స్‌కి షాక్‌ ఇస్తుంటారు. అక్కడి ప్రేక్షకులు కూడ ఈ షాకులు తట్టుకుని సినిమాలను ఆదరించేస్తుంటారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇలాంటి విషయాలలో ఒకొక్కసారి చాల విభిన్నంగా రెస్పాండ్ అవుతారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ లో హీరో, హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలని వారికో లెక్క ఉంది అని అంటారు. దానిని తప్పి ఎవరు సినిమాలు తీసినా ఆదరించిన సందర్భాలు చాల తక్కువ. తమిళంలో విశాల్‌ ఒక సినిమా నిర్మించాడు. తనే హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ లక్ష్మి మీనన్‌పై గ్యాంగ్‌ రేప్‌ జరుగుతుంది. హీరోకి ఒక వింత రోగం వల్ల స్పృహ కోల్పోయిన హీరో ఎదురుగానే హీరోయిన్‌ని గ్యాంగ్‌ రేప్‌ చేస్తారు. వారిపై పగ తీర్చుకోవడం ఈ సినిమా కథ. తమిళంలో ఈసినిమా ఇప్పటికే రిలీజ్‌ అయింది బాగానే ఆడుతోంది. త్వరలో ఈ సినిమాను తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు దీనిని ఆదరిస్తారా? అనేది మాత్రం అనుమానమే. ఇప్పుడు ఇంద్రుడు టైటిల్‌తో అనువాదమైన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. విశాల్‌కి తెలుగులో చాలా కాలంగా హిట్‌ లేదు. మరి ఈ సినిమాకి మన ప్రేక్షకులిచ్చే తీర్పేమిటి? అనే విషయం పై టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్యాంగ్ రేప్‌ సీన్స్ ను మన ప్రేక్షకులు ఆదరిస్తే ఇటువంటి సన్నివేశాలతో మరికొన్ని సినిమాలు తీసే అవకాసం ఉంది.
 
Top