సాధారణంగా సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ అని అంటారు. అది నిజం కూడా.
కాకపోతే, ప్రస్తుతం ట్విట్టర్ ప్రపంచంలో మాత్రం హీరోయిన్స్ దే పైచేయిగా
వుంది. తమ చిలుక పలుకుల ట్వీట్స్ తో... ఈ స్వీటీస్ తెగ ఫాలోయింగ్ సంపాదిం
చేస్తున్నారు. అసలు వీళ్ల పోటికి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు హీరోలు.
దీనికి సంబంధించిన హీరోయిన్స్ ట్విట్టర్ స్టోరీను ఎపిహెరాల్డ్.కం
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
విషయం ఏంటంటే, స్టైలిష్ స్టార్ గా మంచి బాక్సాఫీస్ సత్తా వున్న మెగా హీరో
అల్లుఅర్జున్. అయితే, బన్నీ ట్విట్టర్ ఫాలోవర్స్ 40లక్షలకు పైమాటే! కాని,
మనోడి ఆర్య2 కోస్టార్ కాజల్ ఫాలోయింగ్ ఎంతో తెలుసా? డబుల్ కన్నా ఎక్కువే! ఈ
అందాల అగర్వాల్ 93 లక్షల మందిని ఖాతాలో వేసుకుంది. చుల్ బులీ సమంతా కాజల్
కన్నా కాస్త తక్కువగా 60లక్షల వరకూ ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. ఆమెతో
సమానంగా ఫాలోవర్స్ ని సంపాదించుకుని రేస్ లో గట్టి పోటీనే ఇస్తోంది శృతీ
హసన్.
కాజల్, శృతీ, సమంతలతో గ్లామర్ వార్ లో ఏమాత్రం తీసిపోని అందగత్తెలు అనుష్క,
తమన్నా. కాని, వీళ్లు మాత్రం ట్విట్టర్ లో కొంత వెనకబడ్డారనే చెప్పాలి.
స్వీటీ పోస్ట్ చేసే స్వీట్ ట్వీట్స్ కి ఇంకా యాభై లక్షల మంది కూడా
ఫాలోవర్స్ లేరు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నలభై లక్షల మంది
ఫాలోవర్స్ ని ఫ్లాట్ చేయలేకపోయింది.