కోలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియమణి తాను ఇప్పుడు ఆంటీని అయ్యాను అంటూ తెగ సంబరపడిపోతోంది. సామాన్యంగా హీరోయిన్లు ఏ విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడినా తమ వయసు గురించి మాత్రం నోరు మెదపరు. కానీ ప్రియమణి మాత్రం తన వయస్సు దగ్గర నుంచి ప్రతి విషయం నిర్భయంగా చెపుతుంది.  నటిగా జాతీయ స్థాయి ఉత్తమనటి అవార్డు అందుకుని కూడ హీరోయిన్ గా చెప్పుకో తగ్గ స్థాయిలో రాణించలేదు ప్రియమణి. చక్కని అభినయo ఉన్నా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం కన్నడం, మలయాళం, భాషల్లో నటిస్తూ కాలం గడుపుతోంది. అయితే ఆమధ్య ప్రియమణి ఒక ప్రముఖ వ్యక్తితో సహజీవనం చేస్తోంది అనే వార్తలు కూడ వచ్చాయి. ఆ వార్తలను ప్రియమణి ఖండించింది. ఈ నేపధ్యంలో ప్రియమణి తన సంతోషాన్ని ఆంటీని అయ్యాను అంటు తన ట్విటర్ లో హడావిడి మొదలు పెట్టింది. ప్రియమణి సోదరుడు విశాక్ దేవ్, ప్రార్థన దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించిందట. దీంతో షూటింగ్‌కు కూడా విరామం ఇచ్చి ప్రియమణి తన సోదరుడి కూతురిని లాలిస్తూ గడిపేస్తోంది.. దీనితో ప్రియమణి తల్లి తన కూతురికి పెళ్లి ఆశ కలిగిందంటు ప్రియమణిని చూసి ఆనంద పడిపోతోంది అని టాక్.. దీనిపై ప్రియమణి మాట్లాడుతూ, వయసు పెరుగుతుందన్నది నిజమేనని, దాని కోసం వివాహం చేసుకోవాలని లేదుగా అంటు వెరైటీగా సమాధానం ఇచ్చింది. మరి ఈ నేపధ్యంలో ఇప్పుడే పుట్టిన ఈ చిన్నారి ప్రియమణి పెళ్ళి ఆలోచనలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో చూడాలి మరి. 
 
Top