మంచి టాలెంట్ వున్న మంచు వారి నట వారసుడు మనోజ్. ఈ సన్నాఫ్ పెదరాయుడు రీసెంట్ గా పెద్ద హిట్సే కొట్టాడు. ఎస్పెషల్లీ.... పోటుగాడుతో తాను ఎంతటి పోటుగాడో నిరూపించుకున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ తో అన్ని సెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పోటుగాడు సక్సెస్ తరువాత వెంటనే మరో హిట్ తన పేర జమ చేసుకున్నాడు మంచు మనోజ్. పాండవులు పాండవులు తుమ్మెద అంటూ బాక్సాపీస్ వద్ద బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. బాపుగారి బొమ్మ ప్రణీతతో సరసాలాడుతూ ఈజీగా బాక్సాఫీస్ ఛేజ్ చేశాడు. రెండు వరుస హిట్స్ వచ్చిన తరువాత ఏ హీరో అయినా ఉత్సాహంతో ఉరకేలేస్తాడు. బట్ మనోజ్ అలా కాకుండా లీజర్ గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. అంటే కేర్ ఫుల్ సెలక్షన్ వల్ల ఆలస్యం అవుతుందో ఏమోగాని... లాస్ట్ మూవీ రిలీజ్ తరువాత ఇంత కాలానికి ఓ సినిమా ఓకే చేశాడు. ఆ డిటైల్స్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. మంచు విష్ణుకి మంచి హిట్ రూపంలో దేనికైనా రెడీ అందించిన డైరెక్టర్ జీ. నాగేశ్వర్ రెడ్డితో ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా పేరే.... కరెంట్ తీగ! మరి కరెంట్ తీగ బాక్సాఫీస్ వెలిగిస్తుందా? లేక షాకిస్తుందా? రిలీజ్ అయితే గాని తెలియదు! మమనోజ్ సన్నాఫ్ పెదరాయుడు అనే మరో సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నాడు.
 
Top