రాజకీయాలను సినిమాలను సెంటిమెంట్లు శాసిస్తూ ఉంటాయి. రాబోతున్న ఎన్నికలలో
తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాజకీయ నాయకులు తాము చేతికి
కట్టుకుంటున్న సెంటిమెంట్ తాయత్తుల సంఖ్య కూడ జ్యోతిష్కులు చెప్పిన సంఖ్యలో
తాళ్ళు కట్టుకుని ప్రచారానికి వెళుతున్న నేటి పరిస్థితులను చూస్తే
సెంటిమెంట్లు ఏ స్థాయిలో మన నాయకులను సినిమతరాలను ప్రభావితం చేస్తున్నాయో
అర్ధం అవుతుంది.
ఇన్నాళ్లూ హీరోలకే ఉన్న సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో వారి అభిమానులకు సైతం
పాకింది. ఎందుకంటే వారు ప్రతీ ప్రాజెక్టుని ప్రారంభమైన రోజు నుంచి వారి
సినిమాల విషయాలను ఫాలో అవుతున్నారు. కొత్తగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ని
వైఎస్ఆర్ సెంటిమెంట్ భయపెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే వైఎస్ఆర్
అంటే రాజశేఖర్ రెడ్డి కాదు.
ఈ విషయంలో సంగీత దర్శకుడు యవన్ శంకర్ రాజా. ఆయన్ను రీసెంట్ గా రామ్ చరణ్
సినిమాకు తమన్ స్థానంలో తీసుకుంటున్నట్లుగా వార్తలు రావడం చరణ్ అభిమానులకు
టార్చర్ గా మారింది. దీనికి కారణం యువన్ శంకర్ రాజా మెగా హీరోలందరితో
పనిచేసిన సినిమాలు ఘోరమైన ఫ్లాపులుగా మిగిలాయి. అప్పట్లో అల్లు అర్జున్ తో
చేసిన ‘హ్యాపీ’ యావరేజ్ అనిపించుకుంటే, పవన్ తో చేసిన ‘పంజా’ భయ౦కరమైన
ఫ్లాప్ గా మిగిలింది.
యువన్ మంచి సంగీత దర్శకుడిగా పేరు ఉన్నా తెలుగు వారికి నచ్చే స్థాయిలో
పాటలను స్వరపరచలేడు అనే పేరు ఉంది. ఈ పరిస్థుతులలో తన అభిమానుల భయాన్ని
చరణ్ పట్టించుకుని వారి భయాన్ని తొలగిస్తాడో లేదో చూడాలి.