శ్రీదేవీ, ఈ పేరు ఇండియన్ సినిమాలో ఓ ఏజ్ లెస్ వండర్ కి కేరాఫ్. అందుకే, సంత్సరాలు గడుస్తూనే వున్నా ఆమె క్రేజ్ తగ్గటం లేదు. పెళ్లికి ముందు ఆ తరువాతే కాదు, తన కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందని న్యూస్ వస్తోన్నా... శ్రీ మహిమ మాత్రం తగ్గటం లేదు. అందుకు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంగ్లీష్ వింగ్లీషే చక్కటి ఉదాహరణ. ఇప్పుడు శ్రీదేవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అప్పుడెప్పుడో 2008లో లాస్ట్ హిందీ సినిమా చేసిన శ్రీదేవీ 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చేసింది. అయితే, సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన ఈ గాడెస్ ఆఫ్ బ్యూటీ దక్షిణాదిని మాత్రం చాలా ఏళ్లుగా దూరం పెట్టేసింది. ఆమె లాస్ట్ సౌత్ మూవీ మలయాళ చిత్రం దేవరాగం. ఇక తెలుగులో అయితే మెగా ఎంటర్టైనర్ ఎస్పీ పరుశురామ్. చిరుతో హీరోయిన్ గా చేసిన ఆ సినిమా శ్రీదేవీ తెలుగు ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఓ స్వీట్ మెమరీ. రెండు దశాబ్ధాలు దక్షిణాదిని పట్టించుకోని మిసెస్ బోణి కపూర్.... ఎట్టకేలకు సౌత్ లో సెకండ్ ఇన్నింగ్స్ కి బోణికొట్టనుందని సమాచారం. అయితే, తెలుగులో కాక తమిళంలో శ్రీ రీఎంట్రీ ఇస్తోందట. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అప్ కమింగ్ మూవీలో ఆమెది కీ రోల్ అంటున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ దాదాపూ ఓకే అయిపోయిందని టాక్. మరి కొన్ని నెలల్లో శ్రీదేవీ తన మాతృభాషలో డైలాగ్స్ చెబుతూ కోలీవుడ్ తెరపై కనిపించనుందన్నమాట!
 
Top