తెలుగుదేశం పార్టీలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. పార్టీకి చావు పుట్టుకుల సమస్యగా తయారైన ఈ కీలక ఘట్టంలో లెజెండ్ కూడ చేరిపోయాడు. ఈ పరిస్థుతులలో నిన్న హిందూపురంలో బాలయ్య జూనియర్ పై చేసిన కామెంట్స్ తో జూనియర్ లేకుండానే ఎన్నికల ప్రచారం నడిచే పరిస్థితి క్లియర్ గా కనపడుతోంది. కానీ నిన్న మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ జూనియర్ ను ఆహ్వానించడానికి తన ఇంటి వేడుక కాదనీ కొద్ది రోజుల క్రితం తన అల్లుడు లోకేష్ చెప్పిన మాటలనే రిపీట్ చేసాడు. ఇదే సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పట్ల అభిమానం ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రచారంలో పాల్గొనవచ్చు అంటూ యధాలాపంగా అన్న మాటలను జూనియర్ తనకు అనుకూలంగా మలుచుకుని అతిత్వరలో నిమ్మకూరులోని తన తాత-నానమ్మల విగ్రహాలకు దండలు వేసి అక్కడ నుండి తన అభిమానులందరూ తన తాత స్థాపించిన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకు రమ్మని పిలుపు ఇవ్వడానికి తన తండ్రి హరి కృష్ణతో కలిసి నిమ్మకూరు వెళ్లి అక్కడ నుండి నందమూరి కుటుంబానికి ఎంతో పట్టు ఉన్న కృష్ణా జిల్లాలో కొన్ని ముఖ్య ప్రాంతాలలో ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనను తన సన్నిహితులతో చర్చించుతున్నట్లు టాక్. ఇప్పటికే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు సంబంధాలు చెడిపోతున్నాయి అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ప్రచారం అవసరం అని కార్యకర్తలచేత చంద్రబాబు పై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక ఎత్తుగడ వేయడమే కాకుండా తెలుగుదేశంలోని తన అభిమానుల వర్గాన్ని పెంచి పోషించే ఎత్తుగడ జూనియర్ చేయబోతున్నాడని టాక్. మరి ఈ ఆలోచనకు హరికృష్ణతో పాటు జూనియర్ సన్నిహితులు ఏమంటారు అనే విషయం పై అభిప్రాయ సేకరణలో బిజీగా ఉన్నాడట మన బుడ్డోడు. 
 
Top