పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వెబ్ మీడియాని వేదికగా చేసుకుని ఈమధ్య పవన్ ను విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తి వేస్తున్న విషయం వెనుక పెద్ద ఎత్తుగడ ఉంది అంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కు దూరంగా పూనా లో ఉంటున్న రేణు పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల వైపు ప్రస్తుతం తను ఉంటున్న మహారాష్ట్రలో అడుగులు వేయాలని నిశ్చయించుకున్నట్లుగా మరాఠీ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం సినిమా నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న రేణు దేశాయ్ భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉందని, ఆమె బిజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతోందని, త్వరలోనే ఆమె మోడీని కలిసే అవకాశం ఉందని కూడ మరాఠీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి, మోడీకి మద్దతు పలకవడంతో తన మాజీ భర్తపై పనిగట్టుకుని ప్రశంసలు కురిపించడంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ రేణు దేశాయ్ అనుసరిస్తోంది అనుకోవాలి. ఈ వార్తలే నిజమైతే పవన్ రేణు దేశాయ్ లు విడిపోయినా వారి రాజకీయ ఉద్దేశాలలో మాత్రం కలిసి పయనిస్తున్నారనే అనుకోవాలి. ఈ విషయంలో కూడ రానున్న కాలంలో బీజేపి సాక్షిగా ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఉంటాయో చూడాలి మరి. 
 
Top