తెలుగు తెర సీతమ్మ అంజలి హీరోయిన్ గా నటిస్తున్న ‘గీతాంజలి’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ సభలో టాలీవుడ్ హాస్య బ్రహ్మ, బ్రహ్మనందం అంజలి పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అంజలి గురించి తాను ఎంతో విన్నాననీ అయితే ఆమెతో నటించే అవకాసం ఇన్నాళ్ళకు రావడం తన అదృష్టం అనీ బ్రాహ్మి బహిరంగంగా చేసిన కామెంట్లు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మరొక వైపు ఈ సినిమా కథ అనుకున్నప్పుడు తమ కళ్లలో మెదిలిన రూపం అంజలి. ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమా లేదు అంటు ప్రముఖ రచయిత కోన వెంకట్ చెప్పిన మాటలు కూడ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’ లో కమెడియన్ శ్రీనివాసరెడ్డి నటిస్తూ ఉండటంతో ఈ సినిమా పై ఏర్పడిన నెగిటివ్ ఇమేజ్ ని పోగొట్టుకోవడానికి ఇలా వేదిక పై అంజలి భజన చేసారు అనుకోవాలి. నటునిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగ ఇదే వేదిక పై బ్రహ్మానందానికి సన్మానం అంటు ఆయనను పొగుడ్తూ పనిలో పనిగా అంజలి భజన చేయడం ఈ వేదిక స్పెషాలిటి. ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే నిజంగానే టాలీవుడ్ లో అంజలి వెనుక ఎదో అజ్ఞాత శక్తి ఎదో ఉందనే అనిపిస్తోంది.  
 
Top