nayanatara om my god remake
వెంకీ - న‌య‌న‌తార‌ల కాంబినేష‌న్‌కి దిష్టి త‌గిలింది. తుల‌సి, ల‌క్ష్మిల్లో ఈ జంట ఆకట్టుకొంది. వీరిద్ద‌రితో హ్యాట్రిక్ కొట్టిద్దామ‌ని రాధా మొద‌లెట్టాడు మారుతి. అయితే ఆ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది. దాంతో హ్యాట్రిక్‌కి గండి ప‌డింది. ఆ త‌ర‌వాత ఓమైగాడ్ లో న‌య‌న‌తార‌ని క‌థానాయిక అనుకొన్నారు. దానికీ చెక్ ప‌డిపోయింది. రాధాకి ఇచ్చిన కాల్షీట్లు ఓమైగాడ్‌కి బ‌ద‌లాయించారు. రాధా స‌మ‌యంలోనే న‌య‌న‌కు అడ్వాన్స్ చేతిలో పెట్టేశారు. అయితే ఓమైగాడ్‌కి అన్ని కాల్షీట్లు అవ‌స‌రం లేదు. ఎందుకంటే న‌య‌న‌తార పాత్ర‌కు ఈ సినిమాలో అంత‌స్కోప్ లేదు.

అందుక‌నే.. పారితోషికం త‌గ్గించాల‌ని నిర్మాత‌లు కోరారు. దానికి న‌య‌న స‌సేమీరా అంది. రాధాకి ఎంత ఇవ్వాల‌నుకొన్నారో, ఈసినిమాకీ అంతే ఇవ్వండి. మీ కాల్షీట్లు ఎన్న‌యితే నాకేంటి??   పాత్ర నిడివి త‌గ్గితే నేనేం చేయ‌ను..?? అంద‌ట‌. అస‌లు ప్రాధాన్యం లేని సినిమాకి న‌య‌న‌తార ఎందుకు...?  అనుకొంటున్న చిత్ర‌బృందానికి ఇప్పుడు పారితోషికంలో కూడా ఇబ్బంది పెట్ట‌డంతో... న‌య‌న‌ను ఈ సినిమా నుంచి తొల‌గించార‌ని టాక్‌. ఇప్పుడు వెంకీ కోసం ఓ కొత్త క‌థానాయిని అన్వేషించే ప‌నిలో ఉన్నారు. ప్చ్‌... వెంకీ - న‌య‌న హ్యాట్రిక్ సినిమాకి ఎన్ని అడ్డంకులో..?
 
Top