ప్రిన్స్ మహేష్ తన గత సినిమాల ద్వారా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
సినిమాలలోనే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలకు కూడ మహేష్ ప్రిన్స్ గా
కొనసాగుతున్నాడు. అటువంటి సూపర్ స్టార్ నటించిన సినిమా ఎవరికీ తెలియని ఒక
మారుమూల ఊరిలో ఒకే ఒక్క సెంటర్‌లోనైనా వందరోజులు డైరెక్ట్‌గా ఆడింది అని
చెప్పుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఎవరికీ తెలియని చిన్న సెంటర్‌లో నాలుగు ఆటలతో 100 రోజులు జనం చూడకున్నా
ఆడించి ‘రికార్డ్’ అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని అంటున్నారు
విశ్లేషకులు. ఈ విషయమంతా మొన్న సంక్రాంతికి విడుదలై మహేష్ కెరియర్ లో ఒక
పీడ కలలా మిగిలిపోయిన మూవీ ‘1’ గురించి తూర్పు గోదావరి జిల్లా మారుమూల
గ్రామం తాటిపాక పద్మప్రియ థియేటర్‌లో ‘వన్’ 100 రోజులు ఆడిందని నిర్మాతలు
ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని ఇతర హీరోల అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.
ఏప్రిల్ 19కి ఈ చిత్రం విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. మేకింగ్
పరంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ సినిమాను పెద్ద సెంటర్లలో
సంక్రాంతి తరువాత ఎవరూ పట్టించుకోక పోయినా కాకినాడకు 60 కిలోమీటర్లు
దూరంలోవున్న ఓ పల్లెటూళ్ళో 100 రోజులు ఆడిందంటే ట్రేడ్ వర్గాలే షాక్
అవుతున్నారు.
మరి ఇటువంటి వార్తలు విని పబ్లిసిటీకి పెద్దగా ఇష్టపడని మహేష్ బాబు ఎంత
షాక్ అవుతాడో చూడాలి.