నిన్నటితో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఆరడుగుల బుల్లెట్ లా ఎన్నికలలో దూసుకు వస్తాడు అనుకున్న పవన్ రకరకాల ట్విస్ట్ లు ఇచ్చి చివరకు భారతీయ జనతా పార్టీ జేబులో బొమ్మగా మారిపోయాడు. ఇంత జరుగుతున్నా పవన్ పట్ల ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర బీజేపీ నాయకత్వాలు తన ప్రచారానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంపట్ల పవన్ ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.  ఈనెల 22న నిజామాబాద్‌లో మోడీ సభకు పవన్ హాజరుకానున్నారు. కాని అక్కడ పవన్ కు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది అన్న విషయం పై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ప్రచారంపై సీమాంధ్ర బిజెపి నాయకులెవరూ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కూడా పవన్ సీరియస్‌గా తీసుకున్నారట. ఈ సందర్భంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు పవన్ పై ఒక సెటైరు వేస్తున్నారు.  నిజంగా 2019 ఎన్నికలు తన టార్గెట్‌ అనుకున్నపుడు పవన్‌ ఇప్పుడు అసలు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలి. ఆపై అయిదేళ్ల పాటు ప్రజా ఉద్యమాలు చేపట్టాలి. అప్పుడు ఏ పార్టీ అధికారంలో వున్నా పవన్‌ ఢీ కొట్టగలడు. ఇప్పటి పరిస్థితుల్లో పవన్‌ 2019 నాటికి కాదు, 2024 నాటి ఎన్నికలకు కూడ పవన్ తన జనసేనను బలపరచ లేడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ తనకు తోచింది తాను మాట్లాడు కుంటూ వెళ్లిపోతాడు. సినిమాలలో అయితే ఇలా వరుస లేకుండా మాట్లాడిన డైలాగ్స్ ను ఎడిటింగ్ రూమ్ లో కలుపుకుంటూ పోతారు. కానీ పబ్లిక్ లో జనం మధ్య అనాలోచితంగా పవన్ మాట్లాడుతున్న పవన్ మాటలకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించు కోవలసి వస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. 
 
Top