సినిమాలలో అవకాశాలు తగ్గిపోయినప్పుడు ఎదో ఒక సంచలన వార్తతో మీడియా ద్వారా జనం దృష్టిలో పడటానికి హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రస్తుతం అదే మార్గాన్ని కన్నడ మందారం సంజన ఎంచుకుంది. ‘బుజ్జిగాడు’ సినిమాలో ఒక మెరుపు మెరిసిన సంజనను తరువాత టాలీవుడ్ సినిమా రంగం మర్చి పోయింది. దీనితో అవకాశాలు లేక ఆ మధ్య ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని మీడియాకెక్కింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె నటించిన ఒక కన్నడ సినిమాలో  ఉన్న అశ్లీల దృశ్యాలలో ఉన్నది తాను కాదంటూ రచ్చ మొదలెట్టింది. సంజన తాజాగా కన్నడలో అగ్రజ అనే సినిమాలో నటించగా అది నిన్నే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో సంజనకు సంబంధించిన హాట్ హాట్ సీన్లు చాల ఉన్నాయట. అయితే సంజన అవి చేసింది నేను కాదు అని అంటోంది. అంతేకాదు ఎవరితోనో తీసి తనవిగా చూపిస్తున్నారని మీడియాకి ఎక్కింది. ఇక సినిమా దర్శక, నిర్మతలేమో ఈ సన్నివేశాల గురించి ఆమెకు ముందే చెప్పి మరీ చేశామని, పూర్తి స్పృహతో ఆమె నటించిందని.. ఇందులో తాము ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెబుతున్నారు. కొద్ది కాలం క్రితం టాలీవుడ్ లో యాంకర్ ఉదయభాను నటించిన ఒక సినిమా విషయంలో కూడ ఇటువంటి వివాదమే వచ్చింది. తరువాత ఇది అంతా ఒక పబ్లిసిటీ స్టంట్ గా తేల్చేసారు. మరి సంజన వ్యవహారం కూడ ఎలా ముగింపుకు వస్తుందో చూడాలి. 
 
Top