టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా కదం తొక్కుతున్న ఎమ్మెస్ నారాయణ ఇప్పుడు
నవాబ్ అవతారం ఎత్తుతున్నాడు. ఎమ్మెస్ నారాయణతో కలిసి జూనియర్ నగ్మా
నటిస్తోంది. ఎమ్మెస్ నారాయణ కెరీర్ లోనే తొలిసారిగా ప్రధాన పాత్రలో
నటిస్తున్న మూవీ 'నవాబ్ బాషా'. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా
డైరెక్టర్ బి.రాజేష్ పుత్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జూనియర్ నగ్మా
హీరోయిన్ గా చేస్తోంది.
'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్
షెడ్యూల్ ముగించుకుంది. వచ్చే వారం రెండో షెడ్యూల్ మొదలు కానుంది. కామెడీ
ప్రధానాంశమైన ఈ సినిమాను నవాబ్ కాలం నాటి ఓ యదార్థగాథ ఆధారంగా
తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు. సినిమా
సంతృప్తికరంగా వస్తోందని, ఎమ్మెస్ నారాయణ అద్భుతమైన పర్ఫామెన్స్
చూపిస్తున్నారని దర్శకుడు తెలిపారు.
టైటిల్: నవాబ్ బాషా
ఆర్టిస్టులు:ఎమ్మెస్ నారాయణ,జూనియర్
నగ్మా,రాహుల్,వినోద్,శిరీష,జెన్నీ,శాంతిస్వరూప్,స్నేహ,విజయ్
సాంకేతిక వర్గం:
కెమెరా - కె.శ్రీనివాస రెడ్డి,సంగీతం - బోలే, సునీల్ పుత్ర,పాటలు - మల్లి
మామిడి,ఎడిటర్ - సునీల్,కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం
బి. రాజేష్ పుత్ర