తెల్ల వారితే చాలు స్త్రీల పై దేశంలో జరుగుతున్న అత్యాచార విషయాలకు సంబంధించిన వార్తలతో మీడియా హోరెత్తి పోతూ ఉంటుంది. ఆ విషయంలో మన హీరోయిన్స్ కు కూడ ఈ సమస్య నుండి మినహాయింపు లేదు అని తెలిపే ఒక సంఘటన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. హీరోయిన్ హన్సికకు గోవాలో షాకింగ్ అనుభవం ఎదురైంది. అభిమానుల పేరుతో ఆమె వద్దకు వచ్చిన కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారట. అంతేకాదు ఆమె పట్ల అసభ్యంగా కూడ ప్రవర్తించారట. ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ప్రయత్నించారట. ఈ సంఘటనతో హన్సిక ఒక్కసారిగా షాక్ అయింది. తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ‘ఉయ్‌రే ఉయ్‌రే' సినిమా షూటింగ్ సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఈ సినిమాను ఒకనాటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ జయప్రద నిర్మిస్తోంది. విక్రమ్ కుమార్ ఈసినిమాకు దర్శకుడు. ఇక సంఘటన వివరాలలోకి వెళితే ఈ సినిమాలలో నటిస్తున్న సిద్ధార్థ్-హన్సిక మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో గోవాలోని ఓ బీచ్ వద్ద సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు సినిమా షూటింగ్ లోకి ఎంటరయ్యారు. హన్సిక అభిమానులమంటూ ఆమె వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ అసభ్యంగా ప్రవర్తించారట. ఈ సంఘటనతో షాక్ కు గురైన హన్సిక వెంటనే వారిని తోసేసింది. ఈ విషయాన్ని గమనించిన యూనిట్ సభ్యులు సదరు ఆకతాయిలను అక్కడి నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ సంఘటనతో హన్సిక, యూనిట్ సభ్యులు అప్ సెట్ అయ్యారు. ఆ రోజు షూటింగును ఆపేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. హన్సికకు ఇది మరుపురాని చేదు అనుభవం.
 
Top