ఎదో ఒక హడావిడి చేయందే సమంతకి రోజు గడవదు. సమంతకు సిద్ధార్ధకి మధ్య డ్యాష్--డ్యాష్ అని మీడియాలో వార్తలు రాని రోజు ఉండదు. ప్రస్తుతం తన చిరునామాను కోలీవుడ్ గా మార్చుకున్న ఈ మాయలేడి పై మరో సరికొత్త వార్త హడావిడి చేస్తోంది. అదేమంటే ఏప్రిల్ 17న సిద్ధార్థ్ బర్త్‌డే సందర్భంగా ఆమె తన ప్రియ స్నేహితుడికి అర్ధరాత్రి వేళ ఓ మెసేజ్ ఇచ్చింది. “హ్యాపీ బర్త్ డే టు మోస్ట్ అమేజింగ్ పర్సన్.. థాంక్యూ ఫర్ బీయింగ్ మై గ్రేటెస్ట్ స్ర్టెంథ్ '' అని ట్వీట్ చేసింది. అదేదో ఫోన్‌లో ఇచ్చిన మెసేజ్ అయితే ఎవరికీ తెలిసేది కాదు. కానీ అది ట్విట్టర్ కావడంతో ఇప్పుడు ఆమె విషెస్ కూడా ఓపెన్ టాక్ అయ్యాయి. కానీ ఎంత ప్రేమ లేకపోతే సరిగ్గా అర్ధరాత్రి ప్రపంచానికి తెలిసేలా ట్విట్ చేస్తుంది అంటు ఫిలింనగర్ లో సంచలనం మొదలైంది. ఇది ఇలా ఉండగా ఆమె ఇచ్చిన మెసేజ్ లోని బీయింగ్ మై గ్రేటెస్ట్ స్ర్టెంథ్ అనే పదం పై రకరకాల వ్యాఖ్యానాలు మొదలైపోయాయి. సమంత వేసే ప్రతి అడుగులోను సిద్ధు పాత్ర నీడలా ఉంటుంది అని చెప్పడానికి ఈ క్యూట్ హీరోయిన్ చేసిన ఆర్ధరాత్రి హంగామ మరో ఉదాహరణ. 
 
Top