anushka sharma toofan
హీరోయిన్స్ కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకోవడమే కాదు ఒకొక్కసారి వారు పడే కష్టాలు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అటువంటి సంఘటన ఈమధ్య ఒక బాలీవుడ్ హీరోయిన్ జీవితంలో జరిగింది. హాట్ హీరోయిన్ అనుష్కశర్మ అరగంటపాటు ఇసుక తూఫాన్ లో చిక్కుకు పోయి చుక్కలు లేక్క పెట్టిందట. ఎటూ వెళ్లలేని పరిస్థితిలో నరకం చూసాను అని అంటోంది. ఈ విషయం మాత్రం రాజస్థాన్‌‌లోని ఓ మూవీ షూటింగ్‌లో ఆమెకు ఎదురైన రియల్ స్టొరీ. అనుష్కశర్మ లేటెస్ట్ మూవీ ‘ఎన్‌హెచ్ 10’. నవదీప్‌సింగ్ డైరెక్షన్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోండగా అనుకోకుండా ఇసుక తుపాన్ రావడంతో షూటింగ్‌కు అంతరాయం కలిగి అనుష్కకు భయమేంటే ఏమిటో రుచి చూపించిందట. అసలే ఎడారి... ఆపై ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక దాదాపు అర్థగంటపాటు దుమ్ము ధూళిల మధ్య ఈ బ్యూటీ ఉక్కిరిబిక్కి అయ్యాను అంటూ ఆ విషయాన్ని తన ట్విటర్‌లోపెట్టింది. అయితే యూనిట్ సభ్యులతోపాటు అందరూ క్షేమంగా బయటపడ్డామని పోస్ట్ చేసింది. ఇసుక తుపాను వస్తే ఆ క్షణం ఎలా వుంటుందో కళ్లతో చూశానని అనుష్క ఆ సంఘటనలను తరిచి తరిచి గుర్తుకు చేసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
 
Top