జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున ఓటర్లను జాగృతం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఓటు విలువను తెలియ చేస్తూ నిజాయితీగా సరైన సక్రమ ప్రవర్తన కలిగిన అభ్యర్ధులను ఎన్నుకోమని ఓటర్లకు సందేశ మిస్తూ రాయబడిన స్లొగన్స్ ఈ జనసేన అఫీషియల్ ఓట్ ఫర్ రైట్ పోస్టర్ పై ఉన్నాయి. ధనం, కులం, మతం, లిక్కర్, బహుమతులకు అతీతంగా తన అభిమానులను రాబోతున్న ఎన్నికలలో ఓటు వేయండి అంటు పవన్ ఇచ్చిన స్లోగన్ తో పాటు  ఆచరణకు సాధ్యం కాని రాజకీయ పార్టీల వాగ్ధానాలను నమ్మవద్దు అంటు పవన్ అభిప్రాయం ఈ జనసేన ఓట్ ఫర్ రైట్ క్యాంపైనింగ్ పోస్టర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం జనసేన ఆఫీసు నుండి ఒక అధికారక ప్రకటన వెలువడింది. పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలలో ఏ ఇండిపెండెంట్ అభ్యర్దినీ సపోర్ట్ చేయడం లేదనీ అటువంటి వార్తలు నమ్మ వద్దనీ కూడ ఆ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు.  ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బండారు దత్తాత్రేయ పవన్ ను కలిసి దాదాపు గంటకు పైగా మాట్లాడటమే కాకుండా వచ్చే వారంలో హైదరాబాద్ లో జరుగుబోతున్న మోడీ బహిరంగ సభకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఆహ్వానాన్ని పవన్ అంగీకరించడంతో పవన్ మోడీల బహిరంగ సమావేశాలకు కౌంట్ డౌన్ మొదలైంది.
 
Top