అర్దరాత్రి పబ్స్ లో హీరోలతో డాన్స్ లు చేస్తూ వార్తలలో ఉండే త్రిష పై ఈ
సారి మీడియాకు వెరైటీ వార్త దొరికింది. కోలీవుడ్ బ్యూటీ త్రిష చేతిలో
సినిమాలు లేకపోయిన ఎప్పుడూ ఏదో విధంగా ప్రచారంలో ఉంటూ ఉంటుంది. మూడు పదుల
వయసుకు చేరువవుతున్నా ఏ మాత్రం వన్నె తరగని అందాలతో త్రిష ఇప్పటికి
మీడియాకు హాట్ టాపిక్. త్రిషకు మూగ జీవాలంటే ప్రేమ అన్న విషయం తెలి సిందే.
ముఖ్యంగా కుక్కలు అంటే ఎనలేని మమకారం.
అంతే కాదు రోడ్డు పక్కన ఎలాంటి కుక్క కనిపించినా దాన్ని ఇంటికి తీసుకొచ్చి
సంరక్షణ బాధ్యత తీసుకోవడం త్రిష హాబీ. ఇటీవల శునక సంరక్షణ సంస్థలో
సభ్యురాలిగా చాల యాక్టివ్ గాపనిచేస్తోంది త్రిష. ఈ నేపధ్యంలో ఈ బ్యూటీ
పెంచుకుంటున్న శునకాల సంఖ్య పెరిగిపోవడంతో వాటిని ఆమె స్నేహితురాళ్లు
తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. అంతే కాకుండా వీటికి త్రిష అనే పేరు పెట్టి
పిలుచుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన త్రిష తన పేరును కుక్క పిల్లలకు
పెట్టినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తన ఆనందాన్ని తన ట్విటర్ ద్వారా
పంచుకుంటోంది. దీని గురించి ఈ బ్యూటీ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ తన
స్నేహితురాళ్లు ఈ మధ్య రెండు కుక్కపిల్లల్ని దత్తత తీసుకుని వాటికి త్రిష
అని పేరు పెట్టుకోవడం సంతోషంగా ఉంది అంటూ త్వరలోనే మరికొన్ని కుక్క
పిల్లలకు తన పేరు పెట్టుకుంటారని భావిస్తున్నానని పేర్కొoది. అంతే కాదు ఇది
తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు త్రిష చెపుతోంది. సినిమా
సెలిబ్రేటీలు ఏమిచేసినా అది న్యూస్ అంటారు ఇందుకే కాబోలు.