ఎన్నికలలో పోటి చేయకుండానే మరో సంచలనం పవన్ సృట్టిo చాడు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికలలో పోటి చేస్తున్న సినిమా సెలెబ్రెటీలు అందరిలోను జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చింజన్‌లో అందరికంటే ముందు ఉన్నాడట. జనసేన పార్టీని స్థాపించి రాజకీయ ప్రవేశం చేసిన ప్రతిరోజు ఏదో ఒక రాజకీయ ట్విస్ట్ ఇస్తూ ఉండటంతో పవన్ ఏం చేస్తున్నాడు? ఏమి చేయబోతున్నాడు? అంటూ ఆతృత పెరిగి పోవడంతో గత కొన్ని రోజులుగా గూగుల్లో పవన్ గురించి సెర్చ్ విపరీతంగా పెరిగి పోవడంతో పవన్ ప్రధమస్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలువురు నటీనటులు పలు పార్టీల తరఫున పోటి చేస్తున్నారు. వారిలో ప్రజలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్ టెన్ స్టార్ ను గూగుల్ గుర్తించింది. మెగా స్టార్ చిరంజీవి, బాలీవుడ్ కమెడియన్ శ్రీవాత్సవ, ప్రముఖ కన్నడ హీరోయిన్ రమ్య అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీ నగ్మా ఈ టాప్ టెన్ లో స్థానం పొందారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నగ్మా బిజెపి అభ్యర్థి హేమమాలిని కంటే దాదాపు డబల్ హిట్స్‌తో ముందు వరసలో ఉన్నదట. మరోవైపు బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కూడా రాష్ట్రీయ ఆమ్ పార్టీ పేరుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి నెటిజన్లను బాగానే ఆకర్షిస్తూ ఏడవ ర్యాంక్‌లో ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్, ఆర్ఎల్డీ తరఫున పోటీ చేస్తున్న జయప్రదలు, బెంగాలీ ఫిల్మ్ స్టార్ దేవ్‌లు కూడా జాబితాలో ఉన్నారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ జయసుధ ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నా ఆమె గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో కూడ లేకపోవడం ఆశ్చర్యకరం. ఏమైనా పవన్ గూగుల్ సెర్చ్ లో కూడ తన సత్తా ఏమిటో చాటుతున్నాడు.
 
Top