అల్లరినరేష్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లడ్డు బాబు మూవీ ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ మూవీకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన లడ్డుబాబు మూవీ బిజినెస్, అనుకున్న దాని కంటే ఎక్కువుగానే జరగటంతో ప్రొడ్యూజర్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న మూవీగా తెరకెక్కిన లడ్డుబాబు చిత్రానికి ఏరియా వైజ్ గా డిస్ట్రిబ్యూషన్ బాగానే జరిగిందంటూ టాలీవుడ్ మార్కెట్ చెబుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకు శాటిలైట్ బిజినెస్ కూడ అనుకున్న దానికంటే ఎక్కువుగానే జరిగింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దాదాపు 3.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. తక్కువ బడ్జెట్ మూవీకు శాటిలైట్ రైట్స్ ఇంతలా అమ్ముడు పోవటంతో నిర్మాతలు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం మరో రెండు మూవీలకు సంబంధించిన షూటింగ్స్ లో బిజిగా ఉన్నాడు. అల్లరి నరేష్ నటించిన మూవీలలో కంటే లడ్డుబాబు మూవీ అనేది చాలా డిఫ్రెంట్ గా ఉంటుందని టాలీవుడ్ అంటుంది. ఇదే విషయాన్ని అల్లరి నరేష్ సైతం చెబుతున్నాడు. తను గతంలో నటించిన చిత్రాల కంటే ఇది చాలా వైవిధ్యమైనది అని స్టేట్ మెంట్ సైతం ఇచ్చాడు. ఈ మూవీలో పూర్ణ, భూమిక హీరోయిన్స్ గా నటించారు. అలాగే చక్రి సంగీతాన్ని అందించాడు. మొత్తంగా ఈ డిప్రెంట్ లవ్ స్టోరి ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. లడ్డుబాబు మూవీ సక్సెస్ ను సాధిస్తుందా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.
 
Top